అమెరికాలో ఐటీ సినర్జీ సదస్సుకు హాజరుకానున్న మంత్రి నారా లోకేశ్

  • అమెరికా పర్యటనకు వెళుతున్న మంత్రి లోకేశ్
  • ఈ నెల 25న శాన్ ఫ్రాన్సిస్కోలో ఐటీ సదస్సు
  • లోకేశ్ వెంట అమెరికా వెళుతున్న ఉన్నతాధికారుల బృందం 
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 25న శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగే ఐటీ సినర్జీ కాన్ఫరెన్స్ కు లోకేశ్ హాజరుకానున్నారు. అమెరికా పర్యటనకు మంత్రి లోకేశ్ వెంట ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ కూడా వెళుతున్నారు. లోకేశ్ బృందం ఏపీకి తిరిగొచ్చే వరకు ఏపీఈడీబీ సీఈవోగా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు.

Nara Lokesh
IT Conference
USA
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News